Tuesday, May 21, 2024

స్విస్‌ బ్యాంక్‌ల్లో నల్లకుభేరులు, 50 శాతం పెరిగిన భారతీయుల నిధులు

స్విస్‌ బ్యాంక్‌ల్లో భారతీయుల పెట్టుబడులు, డిపాజిట్లు ఒక్క సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. స్వట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ విడుదల చేసిన వివరాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే భారతీయుల డిపాజిట్లు, పెట్టుబడులు 50 శాతం పెరిగాయి. 2021లో భారతీయుల సంపద 30,500 కోట్లుకు పెరిగింది. గత14 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. సెక్యూరిటీలు, డిపాజిట్ల మూలంగా సంపదలో పెరుగుదల నమోదైందని సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. స్విస్‌ బ్యాంక్‌ల్లో 2020లో భారతీయుల సంపద మొత్తం 20,700 కోట్లుగా ఉంది. ఒకే ఏడాది కాలంలోనే ఈ సంపద రెట్టింపు 50 శాతం పెరిగి 30,500( 3.83 బిలియన్‌ స్విస్‌ ప్రాంక్‌లు) కోట్లకు చేరింది. 2020 కి ముందు వరసగా రెండు సంవత్సరాలు స్విస్‌ బ్యాంక్‌ల్లో భారతీయుల సంపద తగ్గింది. 2006లో అత్యధికంగా 6,5 బిలియన్‌ స్విస్‌ ప్రాంకులుగా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీని తరువత స్వల్పంగా తగ్గతూ వచ్చిన సంపద, 2021లో భారీగా పెరిగింది. స్విస్‌ బ్యాంక్‌ల్లో నల్లధనం భారీగా దాచుకుంటారని ప్రచారంలో ఉంది. అక్కడి బ్యాంక్‌లు ఇలాంటి ఖతాల వివరాలను వెల్లడించవు. సెంట్రల్‌ బ్యాంక్‌కు తెలిపిన వివరాల్లో నల్లదనం ఖాతాల వివరాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఇలా వెల్లడించిన వివరాల్లో విదేశాల్లో ఉన్న భారతీయులు, సంస్థలు చేసే డిపాజిట్ల వివరాలు ఇందులో లేవు. ఇలా చేసే డిపాజిట్లను భారతీయులు చేసినవిగా లెక్కించరు.

మన దేశం నుంచి భారీ ఎత్తున వ్యక్తులు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో నల్లధనం దాచుకున్నారని గతంలో పనమా పేపర్స్‌ వెల్లడించింది. నల్లకుభేరుల వివరాలను ఈ బయటపెట్టబోమన్న హామీతోనే అక్కడి బ్యాంక్‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు చెందిన వారు ఒక్కడ భారీ ఎత్తున నల్లధనాన్ని దాచుకుంటున్నారని చాలా కాలంగా ఉన్న విమర్శ. స్విస్‌ బ్యాంక్‌ల్లో అధ్యధికంగా బ్రిటన్‌ దేశీయులకు 379 బిలియన్‌ స్విస్‌ ప్రాంక్‌ల నిధులు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్నా అమెరికన్లు 168 బిలియన్‌ స్విస్‌ ప్రాంక్‌ల నిధులు కలిగి ఉన్నారు. ఇలా అత్యధిక నిధులున్న దేశాల్లో మన దేశం 44వ స్థానంలో ఉంది. బ్రిక్స్‌ దేశాల్లో రష్యా 15వ ,చైనా 24వ స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్‌ దేశీయుల సంపద 712 మిలియన్‌ స్విస్‌ ప్రాంక్‌లు, బంగ్లాదేశీయుల సంపద 872 మిలియన్‌ స్విస్‌ ప్రాంక్‌లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement