Monday, May 6, 2024

సమగ్ర పరిష్కారాలను అందించడంలో 25ఏళ్లు పూర్తి చేసుకున్న బీజీజీటీఎస్‌..

హైదరాబాద్‌ (ప్రభ న్యూస్‌) : బీహెచ్‌ఈఎల్‌ – జీఈ గ్యాస్‌ టర్బయిన్‌ సర్వీసెస్‌ (బీజీజీటీఎస్‌) ప్రై.లి. గ్యాస్‌ టర్బయిన్‌ టెక్నాలజీలో వివిధ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సమగ్ర పరిష్కారాలను అందించడంలో 25ఏళ్లు పూర్తి చేసుకుంది. 25ఏళ్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా బీజీజీటీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లలిత్‌ సంక్రాని మాట్లాడుతూ… విద్యుత్‌ రంగంలో డికార్బనైజేషన్‌ సాంకేతికతలను అనుసరించే విషయానికి వస్తే భారతదేశం అంతర్జాతీయంగా పేరొందిందన్నారు.

తాము 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేవ ఎనర్జీ రంగంలో గ్యాస్‌ ఆధారిత శక్తి చేకూర్పును మరింత అధికం చేసేందుకు ముమ్మర పవర్‌ సర్వీసెస్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ను అందించడంలో గణనీయ పాత్రను పోషించడాన్ని తాము కొనసాగించనున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement