Saturday, May 4, 2024

ఆకర్షణీయమైన ఆదాయం.. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫం డ్స్‌ నిర్వహించే ఏడు స్కీమ్స్‌ ఆయా కేటగిరిల్లో అగ్రస్థానం లో ఉన్నాయి. సంవత్సరకాలం గా స్టాక్‌ మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ద్ర వ్యోల్బణం పెరగడం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఉక్రెయిన్‌ సంక్షోభం వంటి కారణాల వల్ల మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

ఫలి తంగా బీఎస్‌సీ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ జులై 12 నాటికి కేవలం 1.41 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది. మంచి పనితీరుకనబరిచిన మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రధా నంగా ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ భారత్‌ కన్జూమషన్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ ఈక్విటీ అండ్‌ డెబిట్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ మల్టి ఎసెట్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫ్యూర్‌ ఈక్వీటి ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ ఎఫ్‌ ఎంసీజీ ఫండ్‌ అధిక రాబడిని అందించాయని సంస్థకు చెందిన నరెన్‌ వివరిం చారు.

ఈ ఫండ్స్‌ 14 నుంచి 20 శాతం రిటర్న్స్‌ సాధించినట్లు తెలిపారు. వీటితొ పాటు ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ ఇండియా అపర్చునిటీస్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్‌ డివిడెంట్‌ ఈల్ట్‌ ఫండ్‌ ఉన్నాయని తెలిపారు. ఇవి 7 శాతం నుంచి 13 శాతం వరకు రాబని సాధించినట్లు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement