Monday, July 26, 2021

రూ.6,344 కోట్లకు పైగా మోసం చేసిన చోక్సీ

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.6,334.94 కోట్లకు పైగా మోసం చేశారని సీబీఐ తాజా అనుబంధ అభియోగపత్రంలో వెల్లడించింది. ఈ కుట్రకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులు కూడా సహకరించారని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తొలి ఛార్జిషీట్‌లో 18 మందిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ.. తాజాగా మరో నలుగురిని చేర్చింది. వారిలో గీతాంజలి సంస్థల మాజీ అధిపతి సునీల్ వర్మ, నక్షత్ర సంస్థ డైరెక్టర్ ధనేష్ సేథ్‌తో పాటు ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంకా 2014, 2015, 2016ల్లో జరిగిన మోసాన్ని లోతుగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అది పూర్తయ్యాకే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు జరిగిన నష్టం ఎంతో తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News