Friday, May 3, 2024

వైద్య ఉపకరణాల దిగుమతిలో 41 శాతం పెరుగుదల..

గడచిన ఆర్థిక సంవత్సరంలో వైద్య ఉపకరణాల దిగుమతి ఏకంగా 41 శాతం పెరుగుదల నమోదైంది. వాటి విలువ రూ.63,200 కోట్లు. 2020-21లో 44,708 కోట్ల విలువైన మెడికల్‌ డివైస్‌ల దిగుమతులు సాధించగా గత ఏడాది 41 శాతం అధికంగా దిగుమతులు చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాల ఆధారంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ డివైస్‌ ఇండస్ట్రీ కోఆర్డినేటర్‌ రాజీవ్‌ నాత్‌ ఈ విషయం వెల్లడించారు.ప్రధానంగా చైనా నుంచి దిగుమతుల్లో పెరుగుదల కన్పిస్తోందన్న ఆయన ఆయా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే దేశీయంగా తయారీకి అవకాశం లభిస్తుందని అన్నారు. చైనా నుంచి దిగుమతులను నెమ్మదిగా తగ్గించుకోవాలని కేంద్రం విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ చైనా నుంచి దిగుమతులు ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గలేదని చెప్పారు.

2020-21లో చైనా నుంచి రూ. 9,112 కోట్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకోగా 2021-22లో 48 శాతం మేర పెరిగి రూ. 13,538 కోట్ల మేర దిగుమతులు చేసుకోవలసి వచ్చింది. అదే విధంగా గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమెరికానుంచి వైద్య ఉపకరణాల దిగుమతులు 48 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాలు, జర్మనీ, సింగపూర్‌, నెదర్లాండ్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న మొత్తంతో సమానంగా ఉండటం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement