Friday, April 26, 2024

Analysis: రోజాకు జబర్దస్త్​ శాఖ.. టూరిజం, సాంస్కృతికానికి ఫుల్ జోష్‌!

సినీరంగ నేప‌థ్యం.. చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అనుభ‌వంతో పాటు బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్‌గా న‌వ్వులు పూయించిన రోజా అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ మేన‌రిజ‌మ్‌.. జోష్‌ఫుల్‌గా ఉండే న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఏపీ కేబినెట్‌లో చోటు ద‌క్క‌డంతోపాటు.. టూరిజం, సాంస్కృతిక శాఖ ఇవ్వ‌డం స‌ముచిత‌మేనంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఫ‌స్ట్ ట‌ర్మ్‌లోనే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశ‌ప‌డ్డ‌ప్ప‌టికీ రెండో ట‌ర్మ్‌లో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ ఇవ్వ‌డంతో అప్ప‌ట్లో శాంతించిన‌ట్టు చెప్పుకుంటారు.

ఇక‌.. చిత్తూరు జిల్లాలో ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీ హ‌వా ఉండేది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, కార్య‌క‌ర్త‌ల‌ను ఆదుకుని విధానంతో న‌గ‌రిలో ఇప్పుడు టీడీపీ నామ‌మాత్ర‌మే అని చెబుతున్నారు. అలా త‌న సొంత ఇమేజ్‌తో పార్టీని కాపాడుకుంటూనే.. నియోజ‌క‌వ‌ర్గంలో కంట్లో న‌లుసులా మారిన‌ రెబ‌ల్స్‌ని దీటుగా ఎదుర్కొంటూ వ‌స్తున్నారు రోజా.

అయితే.. ఓ టీవీ షోలో చేసే వెకిలి కామెంట్స్‌.. బూతు త‌ర‌హా స్కిట్ల‌తో ప‌ర్స‌న‌ల్‌గా కొంత డ్యామేజీ జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు రాజ‌కీయ‌ విమ‌ర్శ‌కులు. అయినా వాట‌న్నిటినీ త‌ట్టుకుని నిల‌బ‌డి, త‌న స్టామినా ఏమిటో ఎప్ప‌టిక‌ప్పుడు రుజువు చేసుకుంటున్నారు ఆర్కే రోజా. కానీ, కొన్ని సంద‌ర్భాల్లో జ‌బ‌ర్ద‌స్త్ త‌ర‌హాలోనే అసెంబ్లీలో త‌న వ్య‌వ‌హార ధోర‌ణి ఉండ‌డాన్ని స్వ‌యానా సొంత‌ పార్టీ లీడ‌ర్లే త‌ప్పుప‌ట్టారు. వీట‌న్నిటినీ ఎదుర్కొంటూ.. ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోకుండా పొలిటిక‌ల్‌గా రాణిస్తున్నారు రోజా. రోజాకు ద‌క్కిన మంత్రి ప‌ద‌విపై సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement