Sunday, April 28, 2024

ఏపీ మండలిలో తగ్గిన టీడీపీ బలం… ఇక మూడు రాజధానులకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎనిమిది సభ్యుల పదవీ కాలం ఇవాళ్టితో ముగియనుంది. సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా…టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది. దీంతో శాసనమండలిలో వైసీపీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోంది.

వరుసగా శాసన మండలిలో సభ్యులు ఒకరి తరువాత మరొకరు పదవీ విరమణ చేస్తున్నారు. ఆ సీట్లన్నీ శాసనసభలో మెజార్టీ ఉండటంతో వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఫలితంగా శాసనమండలిలో వైసీపీ పూర్తి ఆధిపత్యం సంపాదిస్తోంది. మొత్తం శాసన మండలిలో సభ్యుల సంఖ్య 58. అందులో శుక్రవారం ఏడుగురు టీడీపీ..ఒక వైసీపీ సభ్యుడు శాసన మండలి కోటాలో ఎన్నికైన వారు పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఇదే కోటాలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. కరోనా కారణంగా ఎన్నికలు జరగకుండా నిలిచిన ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో మొత్తం 14 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఫలితంగా 44 మంది సభ్యులు ప్రస్తుతం సభలో ఉన్నారు. అందులో వైసీపీ నుండి 19, టీడీపీ నుండి 15 మంది, బీజేపీతో సహా ఉపాధ్యాయ..గ్రాడ్యుయేట్ స్థానాలు కలుపుకొని పది మంది ఉన్నారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీదే ఆధిపత్యం. సభలో 151 సీట్లతో తిరుగులేని మెజార్టీ సాధించారు వైసీపీ… ఇప్పుడు శాసనమండలిలోనూ అదే తరహా ఆధిపత్యం కొనసాగించనుంది. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసారు. ఆ తరువాత జనవరి 2020 లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై రాజధాని బిల్లులను ఆమోదించింది. అనంతరం శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదం ప్రకటించారు. ఆ వెంటనే శాసన మండలికి బిల్లుల ఆమోదానికి వెళ్లాయి. అయితే, అక్కడ టీడీపీ ఆ సమయంలో ఆధిపత్యం కొనసాగుతోంది. ఛైర్మన్ తన విఛక్షణాధికారం మేరకు బిల్లులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తాము అధికారంలో ఉన్నా.. తమ మాటకు గౌరవం లేకుండా తమను అవమానించే విధంగా వ్యవహరించారనే కారణంతో.. వెంటనే శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. అయితే, అది ఇంకా ఆమోదం పొంద లేదు. ఇప్పుడు మండలిలోనూ వైసీపీకి బలం పెరగడంతో ఇక మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం పడినట్లే.

మూడు రాజధానలు ఏ క్షణమైన ఏర్పాటు కావొచ్చని, విశాఖ నుంచే పరిపాలిన కొనసాగుతుందని ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పుడు శాసన మండలిలో వైసీపీకి పూర్తిస్తాయి బలం ఉండడంతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఏపీలో త్వరలోనే కేబినెట్ విస్తరణ.. తెరపైకి కొత్త మంత్రుల పేర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement