Wednesday, May 15, 2024

ఏపీలో సీఎం జగన్ పాలనకు రెండేళ్లు..

ఏపీలో సీఎం జగన్ ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. 2019 అసెంబ్లీ ఎన్నిల్లో ప్రభంజనం సృష్టించి.. 151 సీట్లు గెలుపొందారు. అనంతరం మే 30న జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ప్రతిపక్షంలో ఉండగా.. ప్రజల అవసరాలేంటో తెలుసుకున్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వానికి కరోనా పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు.

ఈ పుస్తకాన్ని సీఎం జగన్ ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు. ఈ పుస్తకంలో మేనిఫెస్టోలో చెప్పినవాటితోపాటు చెప్పని అంశాలను కూడా ఈ రెండేళ్లలో ఎలా అమలు చేశారో వివరిస్తారు. ఇందులో అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ-వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రజల దగ్గరకు ఆ పుస్తకాన్ని పంపించి.. అమలు తీరును పరిశీలించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement