Saturday, April 27, 2024

ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు

ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’’ నేటితో సరిగ్గా నాలుగేళ్లు పూర్త  చేసుకుంది. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.

రాష్ట్రలోని 13 జిల్లాల్లోని మొత్తం 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్‌ విడిది చేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు జగన్‌. నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు.

వివక్షలేని పాలనను అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు. దీంట్లో భాగంగానే మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతిలేని, వివక్షలేని రీతిలో ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయి. గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజససాధనేలో కొత్త ఒరవడిని సృష్టించాయి. గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చాయి. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి.ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ .. సేవలందించడానికి వచ్చారు. మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌లైబ్రరీలు… ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గతొడిగినవే.

ప్రజాసంకల్పయాత్రద్వారా ఇచ్చిన హామీలు, వాటిని దాదాపుగా అమలు చేయడంతో… జగన్‌ అనే పేరు విశ్వసనీయతకు మరో రూపంగా నిలబడింది. ప్రజాసంకల్పయాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైయస్‌. జగన్‌ సాధించారు. నాలుగేళ్ల కిత్రం మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు.

మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచనం కలిగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్‌ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశా చట్టం తెచ్చారు. చట్టంగా కేంద్రం ఇంకా ఆమోదించకపోయినా.. చట్టం స్ఫూర్తిని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తున్నారు.

- Advertisement -

అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అయినా ప్రజల గుండెచప్పుడు నుంచి శ్రీ జగన్‌ ఎప్పుడూ దూరంకాలేదు. ప్రజాసంకల్పయాత్ర స్ఫూర్తి పాలనకలో కొనసాగుతూనే ఉంది. అందుకే తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, కార్పొరేషన్లు, మున్సిపల్‌ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూనే ఉంది. ప్రజలనాడిని, వారి గుండె చప్పుడు ప్రమాణాలుగా తీసుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యం అవుతున్నాయి. గత రెండున్నరేళ్లకాలంలోని ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ వచ్చినా.. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌గారు తనదిగా మార్చుకున్న ప్రజల గొంతుక ప్రకారమే.. సంక్షేమ పథకాల అమలు దేశంలోనే అగ్రగాయి రాష్ట్రంగా ఏపీ నిలవగలిగింది. ఇంతటి కోవిడ్‌ విపత్తు సమయంలో కూడా ఆకలి చావుకు తావులేకుండా పరిపాలన కొనసాగింది.

ఇది కూడా చదవండి: COVID-19: ‘కొవాగ్జిన్‌’ తీసుకున్న అమెరికాలోకి ఎంట్రీ!

Advertisement

తాజా వార్తలు

Advertisement