Saturday, May 4, 2024

YCP vs TDP – పల్నాడులో ఫ్యాక్షన్ ప‌డ‌గ‌.. టీడీపీ కార్యాలయానికి నిప్పు

సత్తెనపల్లిలో చంద్రబాబు మాటల తూటాలు
అంబటి రాంబాబుపై విమర్శల జ‌ల్లు
క్రోసూరులో ప్రతీకార చర్య
టీడీపీ కార్యాలయానికి నిప్పు
సభ సక్సెస్ తట్టుకోలేక వైసీపీ ఆగడం
టీడీపీ అభ్యర్థి భాష్యం ప్ర‌వీణ్‌ ఆరోపణలు
తెలుగుదేశం శ్రేణులు ధర్నా
ఘటనాస్థలిలో పోలీసుల మొహరింపు
నేడు వినుకొండలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ
పల్నాడులో క్షణ క్షణం పొలిటికల్ హీట్

( ఆంధ్రప్రభ , క్రోసూరు / పల్నాడు బ్యూరో ) ఎన్నిక‌ల వేళ.. పల్నాడులో ఫ్యాక్షన్ పడగ విప్పింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ మంటలు రాజుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రజాగళంతో పల్నాడులో యుద్ధ భేరీ మోగించిన కొన్ని గంటల్లోనే ప్రత్యర్థి వర్గాలు తమ సెగను చూపించాయి.పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో క్రోసూరు ప్రజలు భయంతో భీతిల్లిపోయారు. ఈ ఘటన సమాచారంతో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.పదిరోజుల కిందట మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. సభలు, సమావేశాలకు నిర్వహించేందుకు అనుకూలంగా తాటాకులతో కూడిన పందిరి ఏర్పాటు చేశారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రం ఉన్నా మంటలు ఆర్పడానికి సిబ్బంది ఆలస్యంగా వచ్చారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఘటనాస్థలిలో పికెట్ ఏర్పాటు చేశారు.

క్రోసూరులో టీడీపీ ఆందోళన

క్రోసూరు నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు టీడీపీ, జనసేన నేతలు చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థితిలో తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభసక్సెస్ కావడంతో ఓర్వలేక ప్రత్యర్థి పార్టీ నేతలే ఈ అకృత్యానికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మండిపడ్డారు. ప్రజాగళం సభకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక దుశ్చర్యకు పాల్పడినట్టు ఆరోపించారు. వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారని, పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశౄరు. ప్రశాంతంగా ఉన్న సమయంలో నంబూరు శంక్రరావు చిచ్చుపెట్టారని.. నిబద్దత, క్రమశిక్షణ కలిగిన టీడీపీ, నీచ రాజకీయాలు చేయదన్నారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

ఉదయం ప్రశాంతం… రాత్రికే సెగ
ఈ ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పాటు పడాలని ప్రజలను కోరుతూ ఆదివారం ఉదయం నరసరావుపేటలో పల్నాడు కలెక్టర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఇక సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర వినుకొండకు చేరుతోంది. ఇక్కడ శాంతి భద్రతల ఏర్సాట్లుపై పోలీసులు బిజీ బిజీగా ఉన్న తరుణంలో క్రోసూరులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగలు దహనం చేయటంతో… పల్నాడు పోలీసులు ఉలిక్కి పడ్డారు. పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు సతమతమవుతున్నారు. మరో పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పల్నాడులో వైసీపీపై నిప్పులు చెరుగుతున్నాయి.

ఇది ఫ్యాక్షన్ రగడేనా?
ప్రధాన రాజకీయ పక్షాలు వైసీసీ, టీడీపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సత్తెనపల్లిలో ప్రజాగళం సభలో పాల్గొన్నారు. మంత్రి అంబటి రాంబాబుపై నిప్పులు చెరిగారు. ఈ సభలో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతే కాదు ఎమ్మెల్సీ జంగాకృష్ణ మూర్తి టీడీపీలో చేరారు. ఇక ఎన్నికల కార్యాచరణకు చంద్రబాబు దశ దిశ నిర్ధేశానికి ఆదివారం సత్తెనపల్లిలోనే మకాం వేశారు. ఆదివారం ఉదయం మాచర్ల, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితిలోనూ పల్నాడులో పసుపు జెండా ఎగరాలని, పూర్వ వైభవం సాధించాలని టీడీపీ నేతలకు హిత బోధ చేశారు. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టాలని, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సాన్నిహిత్యం పాటించాలని, సమన్వయంగా వ్యవహరించాలని చంద్రబాబు క్లాస్ పీకారు.

చంద్రబాబుకి జైలు జీవితం తప్పదు – అంబటి రాంబాబు

ఇక ప్రజాగళం సభలో చంద్రబాబు విమర్శలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగానే స్పందించారు. చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ డ్యాన్సర్లని తిట్టిపోశారు. టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఆదివారం క్రోసూరులో రాజకీయ రగడ ప్రారంభం కావటంతో.. పల్నాడులో క్షణ క్షణం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement