Saturday, May 18, 2024

పేదలకు వెల్ఫేర్‌, చంద్రబాబుకు ఫేర్‌వెల్.. ఏడాది పొడవునా సంక్షేమ క్యాలెండర్‌: సీఎం జ‌గ‌న్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఇది పేదల బడ్జెట్‌.. సంక్షేమం.. అభివృద్ధి సమతుల్యంతో దీనికి రూపకల్పన జరిగింది బడ్జెట్‌తోనే 2022- 23 సంవత్సరానికి పేదలకు సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం. ఇది పేదలకు వెల్ఫేర్‌ క్యాలెండర్‌ అయితే చంద్రబాబునాయుడుకు మాత్రం వచ్చే ఎన్నికల్లో మరోసారి ఫేర్‌వెల్‌ కానున్నదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌కు ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించగా మెజారిటీ సభ్యులు హర్షామోదం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టాం.. ప్రతిపక్షం తన ఉనికి కోసం, లేని సమస్యలు ఉన్నట్లు-గా చిత్రీకరించి, వక్రీకరించి రోజూ డ్రామాలు, కథలతో కాలక్షేపం చేసిందని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 95 శాతం వాగ్దానాలతో పాటు నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

కరోనా వచ్చి ఆదాయాలు తగ్గినా మన సంకల్పం ఎక్కడా చెదరలేదు.. మన దీక్ష మారలేదు.. ప్రజలకు చేస్తున్న మంచిలో ఎక్కడా తగ్గలేదన్నారు. ప్రజలకు ఏమీ చేయడం లేదని, ఏదీ అందడం లేదని విమర్శించే అవకాశం ప్రతిపక్షానికి లేదన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పాలనలో ఫలానాది బాగుందని చెప్పే సాహసం చేయలేదని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 44 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకోవటమే మినహా మంచి పని ఒక్కటి లేదన్నారు. ఈ ఏడాది దాదాపు రూ. 55 వేల కోట్లు నేరుగా డీబీటీ- విధానంలో లబ్దిదారుడికి అందిస్తున్న ఏ-కై-క ప్రభుత్వం తమదని చెప్పారు. పరోక్షంగా ఇచ్చేది కలుపుకుంటే అది మరో రూ.17,305 కోట్లు- అదనమన్నారు. దేశ చరిత్రలోనే ఇలాంటి డీబీటీ-ని, పారదర్శక పాలన కానీ ఎక్కడా లేదన్నారు. మేం అమలు చేస్తున్న ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నాం అన్నది ఎలాంటి సందేహాలకు తావు లేకుండా లబ్దిదారులు కూడా మెరుగ్గా వారి కుటు-ంబ అవసరాలను ప్లాన్‌ చేసుకునే దిశగా అమలు చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సామాజిక తనిఖీ చేయడంతో పాటు-, ఎలాంటి లంచాలకు, వివక్షకు తావు లేకుండా ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెబుతూ.. ఏకంగా కేలండర్‌నే విడుదల చేసి ఆ ప్రకారం క్రమం తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు.

ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 వరకు ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఏ పథకం ఏ నెలలో అందించబోతోంది వివరిస్తూ.. శాసనసభ సాక్షిగా సంక్షేమ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో వసతి దీవెన, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన. విద్యా సంవత్సరంలో త్రైమాసికం పూర్తి కాగానేఅందిస్తామన్నారు. ఇందులో భాగంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మే లో విద్యాదీవెన ఉంటు-ంది. ఖరీఫ్‌ 2021కు సంబంధించి అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఉపయోగపడే విధంగా మే నెల్లోనే పంపిణీ చేస్తామని వెల్లడించారు. అదే నెల్లో రైతుభరోసా సొమ్మను రైతుకు పెట్టు-బడికి విడుదల చేస్తామని ప్రకటించారు. మత్స్యకార భరోసాను కూడా ఆ నెలలోనే ఇస్తామన్నారు. జూన్‌లో అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తామనిఈ ఒక్క పథకానికే . రూ.6500 కోట్లు- ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడుతో పాటు-, అర్హత ఉండీ పథకాలు అందని వారికి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తామని వివరించారు.

ఆగస్టులో విద్యాదీవెన, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు, నేతన్న నేస్తం సెప్టెంబరులో వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 25 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.4500 కోట్లు- అందిస్తామని ప్రకటించారు. అక్టోబరులో వసతి దీవెన, రైతు భరోసా రెండో విడత కూడా ఉంటు-ందని నవంబరులో విద్యాదీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలిపారు. డిసెంబరులో ఈబీసీ నేస్తం, లా నేస్తంతో పాటు- అర్హత ఉండి మిగిలిపోయిన వారికి ఆయా పథకాలకు ఎంపికచేసి పూర్తి స్థాయిలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనేదే తమ సంకల్పమన్నారు. జనవరిలో రైతు భరోసా మూడో విడత, వైఎస్సార్‌ ఆసరాతో దాదాపుగా 79 లక్షల అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ.. దాదాపు రూ.6700 కోట్లు- జగనన్న తోడు కింద సామాజిక పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750 పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. పిబ్రవరిలో విద్యాదీవెన, జగనన్న చేదోడు, మార్చిలో వసతి దీవెన కార్యక్రమం అమలవుతాయన్నారు. నవరత్నాల పేరిట పలు పథకాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాల అమలు ఎలా జరుగుతుందో మన రాష్ట్రంలోని లబ్దిదారులను అడిగితే తమ ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందన్నారు. ఈ బడ్జెట్‌ ఒక డాక్యుమెంట్‌. ఇది ప్రజల బడ్జెట్‌. ఇది రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌. గతంలో బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టినా.. బడ్జెట్‌ అంటే అంకెల గారడీ అని ప్రతిపక్షాలు విమర్శించడం చూశాం. కానీ ఈ 3 సంవత్సరాల పరిపాలన, తమ బడ్జెట్‌ ఏ ఒక్కరు చూసినా.. మూడేళ్లుగా ఆచరణ కనిపిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement