Sunday, April 28, 2024

AP: నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం.. మాజీ మంత్రి నారాయణ..

నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తాం.. క్లీన్‌స్వీప్‌ చేస్తామని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నారాయణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఆయన.. వచ్చే నెల రెండో తేదీన చంద్రబాబు నెల్లూరు పర్యటనపై చర్చించారు.. ఇక, ఆ తర్వాత మీడియాతో నారాయణ మాట్లాడుతూ… నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తాం.. క్లీన్ స్వీప్ చేస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..

నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నేతలే లేరన్న ఆయన.. వచ్చే నెల రెండో తేదీన జరిగే చంద్రబాబు టూర్‌లో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని వెల్లడించారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చంద్రబాబు – పవన్ కల్యాణ్‌ చర్చించుకుంటున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది త‌మకు తెలియదన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే చంద్రబాబు క్లారిటీ ఇస్తారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నారాయణ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement