Monday, April 29, 2024

ఆరోగ్య శ్రీ పడకలు కేటాయించని ఆస్పత్రులపై కొరడా..

విశాఖ జిల్లాలో కోవిడ్ ఆదేశాలను సవ్యంగా అమలు చేయనందుకు 25 ఆసుపత్రులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 25 ఆస్పత్రులపై రూ.52 లక్షలు జరిమానా విధించారు. 50శాతం ఆరోగ్యశ్రీ పడకలు కేటాయించక పోవడం, ఎక్కువ చార్జీలు వసూలు చేస్తూన్న ఆస్పత్రులపై జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు. క్యూ1 ఆసుపత్రికి రూ.5 లక్షలు, నవ్య గ్రీన్, ఎడ్రినలిన్, దయ, సెవెన్ హిల్స్, ఉజ్వల్ , సుశ్రుత ent, పవన్ సాయి, ఆసుపత్రులకు రూ.3 లక్షలు, ఆయుష్మాన్, యునిక్, విజేత, కేర్ , శ్రీ శివాని, LG , స్టార్ పినాకిల్ , సెంట్ ఆన్స్ జూబ్లీ, మెడికోర్ యూనిట్ – 3, ఓమ్నిఆర్కె, సురక్ష ఆసుపత్రిలకు రూ.2 లక్షలు, సత్యదేవ్ ,వెంకటరామ, స్మైల్ కేర్, పినాకిల్ ఆసుపత్రులకు ఒక లక్ష చొప్పున జరిమానా…

Advertisement

తాజా వార్తలు

Advertisement