Thursday, April 25, 2024

అదృష్టం అంటే ఈ రైతుదే..! పొలంలొ దొరికిన వజ్రం..

అదృష్టం వజ్రం రూపంలో ఓ పేద రైతు ఇంటి తలుపుతట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలో గురువారం ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. అది వజ్రం అని తెలియడంతో స్థానిక వ్యాపారి ఒకరు రూ.1.2కోట్లకు కొనుగోలు చేశాడు. దాని ధర మార్కెట్లో రూ.2కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అక్కడ పోటీలో 25 క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.20 కోట్లకు రైతు నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏడేళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement