Tuesday, April 30, 2024

ఏకాంతంగా నేటి రాత్రి 9 గంట‌ల‌కు సింహాద్రి అప్ప‌న్న క‌ల్యాణోత్స‌వం…

విశాఖ‌ప‌ట్నం – ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల ఆరాధ్య‌దైవం సింహాంద్రి అప్ప‌న్న క‌ల్యాణోత్స‌వం నేటి రాత్రి 9 గంట‌ల‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాతంగా నిర్వహించ‌నున్నారు.. కరోనా ఉదృతి కార‌ణంగా భ‌క్తులు లేకుండానే ఈ ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌కు ఆల‌య క‌మిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.. కాగా క‌ల్యాణోత్స‌వాన్ని యూట్యూబ్ ద్వారా ((https://www.youtube.com/watch?v=M_gFbdLzweY&feature=youtu.be) తిల‌కించాల‌ని కోరుతూ ఆల‌య క‌మిటీ ఛైర్ ప‌ర్స‌న్ సంచ‌యిత లైవ్ ప్ర‌సార లింక్ ను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.. భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ కరోనా నివారణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కల్యాణోత్సవంలో భక్తులకు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లభిస్తుందనే ఆశాభావం ఆమె వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement