Friday, May 3, 2024

ఎన్నికల్లో పోటీ.. అభ్యర్ధులకు జరిమానా!

గ్రామ కట్టుబాట్లు కాదని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు భారీ జరిమానా విధించారు గ్రామ పెద్దలు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం గుడివాకాలంకలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు అభ్యర్థులకు రూ. 11 వేలు, గ్రామ కట్టుబాట్లు కాదని పోటీచేసిన వారికి మద్దతు ఇచ్చిన ఓటర్లకు రూ.5,500 జరిమానా విధించారు. గ్రామ పెద్దలు అనుమతి ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పోటీచేసినందుకు తప్పు విధిస్తూ గ్రామ పెద్దలు ఈ తీర్పు ఇచ్చారు. ఇప్పటివరకూ ఇద్దరు వార్డు అభ్యర్థులకు,23 మంది మద్దతుదారులకు జరిమానా విధించారు. అంతే కాదు జరిమానా కట్టకపోతే కుళాయి కనెక్షన్లు కట్ చేస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యాంగబద్దంగా పోటీ చేస్తే, జరిమానా విధించి, హక్కులు కాలరాస్తున్నారని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు స్పందించాలని, స్వేచ్చగా తమ గ్రామంలో ఎన్నికలు జరగలేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement