Saturday, April 27, 2024

AP: హేలాపురి, జి షాన్ హోటల్లు పై విజిలెన్స్ దాడులు… విజిలెన్స్ ఎన్​ఫోర్స్ మెంట్​ డి.ఎస్.పి స్వరూప రాణి

(విశాఖపట్నం, ప్రభ బ్యూరో) నగరంలోని పలు పేరు మోసిన హోటల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకుండా , నిల్వ ఉన్న పదార్థాలను కస్టమర్లకు వడ్డిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డి ఎస్ పి స్వరూప రాణి అన్నారు. మంగళవారం ఉదయం స్వరూప రాణి తన బృందంతో కలిసి నగర నడిబొడ్డున జగదాంబ సెంటర్లో గల హేలాపురి పై దాడి చేశారు. కిచెన్లో రెండు రోజుల క్రితం వండి ఉంచిన పలు పదార్థాలను పరిశీలించారు.

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో వందల కొద్ది హోటల్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అందులో ముఖ్యంగా పేరు మోసిన కొన్ని హోటల్లో రెస్టారెంట్లలో అమ్మకాలు జరుపుతున్న బిర్యానీలు, వివిధ రకాల నాన్ వెజిటేరియన్ పదార్థాలు నాణ్యత లేకుండా ఉంటున్నాయని, రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన పదార్థాలను వేడి చేసి వడ్డించేస్తూ యజమానులు సొమ్ములు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆ నిల్వ ఉంచిన పదార్థాలను వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్న విధానాన్ని గమనించారు. అదేవిధంగా మధురవాడ లో గల జి షాన్ రెస్టారెంట్ లో కూడా ఇదేవిధంగా అమ్మకాలు జరుపుతుండడాన్ని దాడులు చేసి ఆమె నిలిపివేశారు. ఈ రెండు హోటల్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సీట్ చేసి ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ విభాగానికి పంపించడం జరిగింది. ఈ రెండు హోటల్లో యజమానులపై కేసులు నమోదు చేసి స్వరూప రాణి దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. ఇదేవిధంగా నగరంలోని పలు పేరు మోసిన హోటల్లు ,రెస్టారెంట్లు నిల్వపదార్థాలను అమ్మకాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిపై కూడా దాడులు జరిపి తగు చర్యలు చేపడతామని స్వరూపా రాణి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement