Wednesday, February 21, 2024

ADB: బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

నిర్మల్ టౌన్, నవంబర్ 28 (ప్రభ న్యూస్) : నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ నగర్ లో ఇవాళ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బీఆర్ఎస్ ప్రచార రథం రావడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన నాయకులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించగా.. బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఇరుపార్టీల మధ్య ఒకరికొకరు మాటలు యుద్ధం కావడంతో కొద్దిసేపు ఘర్షణ చెలరేగింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగడంతో ఇరుపార్టీల నేతలను, కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా నియోజకవర్గంలో ఉప్పెనలాగా ప్రచారం కావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement