Wednesday, October 16, 2024

TDP : అధికారంలోకి రాగానే లోప‌లేస్తాం ..అయ్య‌న్న‌పాత్రుడు

అధికారంలోకి రాగానే విజ‌య‌సాయిరెడ్డిని లోప‌లేయ‌డం ఖాయ‌మ‌ని అయ్య‌న్న‌పాత్రుడు పేర్కొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు.ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు.

యువగళం పాదయాత్రలో నడక భారమై లోకేశ్ బిత్తర సవాళ్లు విసురుతున్నాడని విజయసాయి ఎద్దేవా చేశారు. గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు.

మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి? అని అయ్యన్న ప్రశ్నించారు. క‌నిపించిన‌వాళ్ల‌క‌ల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర‌ అని దుయ్యబట్టారు. న‌డ‌వ‌లేక కోర్టు వాయిదాల పేరుతో యాత్ర‌ని వాయిదా వేసుకోవ‌డం మీ దొంగ‌ల్లుడికే చెల్లు అని అన్నారు. పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారంపోతే నీ బ‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి వ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగ‌సాయి… మూడు నెల‌ల త‌రువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావ‌ట‌ అని ఎద్దేవా చేశారు. స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కించి, పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించి… బొక్క‌లో వేస్తాంరా దొంగ సాయిగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement