Friday, May 3, 2024

వాయుగండం.. నేడు, రేపు వర్షాలు, ఈదురుగాలులు..

అమరావతి, ఆంధ్రప్రభ : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి గాలి నిలిపివేయడం ఇప్పుడు వాయువ్య మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ తెలంగాణ రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా కొమోరిన్‌ ప్రాంతము వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ కొనసాగుతున్నది. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసర ప్రాంతాలల ఉపరిత ఆవర్తనం మధ్య ట్రోపోయావరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి వాయు గుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాయుగుండం హెచ్చరికలు మామిడి రైతాంగాన్ని కలవరపరుస్తున్నాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడైతే పంట నేలరాలి మామిడి రైతాంగం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సీజన్‌ ప్రారంభంలో మామిడి తోటల్లో పూత విరబూసింది. వైరస్‌ల దాటి ఫలితంగా సగం పూత, పిందెకట్టు దశలోనే పంట నష్టం జరిగింది. రెండేళ్ల తరువాత కరోనా కష్టాలు తీరడంతో ఇప్పుడిప్పుడే మార్కెట్‌లు పుంజుకుంటున్నాయి. మామిడికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి పంటను అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటున్న తరుణంలో వాయు గుండం హెచ్చరికలు మామిడి రైతాంగాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement