Thursday, May 2, 2024

Varahi Vijaya Yatra: సత్యదేవుని సేవలో జనసేనాని

అన్నవరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేటి నుంచి వారాహి విజయయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్నవరం సత్యదేవుని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్‌ వెళ్తారు. కత్తిపూడిలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో పవన్‌ పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఈ సాయంత్రం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో పర్యటించి ఏడు సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి అన్నవరంలో సందడి చేస్తుంది. జనసైనికులు వారాహిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్‌ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement