Wednesday, May 15, 2024

వ‌ర‌ద ఉథృతికి గోదావ‌రిలో కొట్టుకుపోయిన వ‌న‌దుర్గ ఆల‌యం

పురుషోత్త‌ప‌ట్నంలో గోదావ‌రి ఒడ్డున ఉన్న వ‌న‌దుర్గ ఆల‌యం వ‌ర‌ద ఉథృతికి కొట్టుకుపోయింది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నిన్న ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది. వరద తాకిడికి తీరం కోతకు గురికావడంతో మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపునకు ఒరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని ముందే గ్రహించిన గ్రామస్థులు గుడిలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement