Wednesday, May 1, 2024

గాంధీ విగ్రహం వద్ద చంద్రదండు.. నిరుద్యోగుల చెవిలో పూలు

ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా చంద్రదండు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం క్లాక్ టవర్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. నల్లబ్యాడ్జీలు ధరించి, చెవిలో పువ్వు, నోట్లో వేలు పెట్టుకుని నిరసన తెలిపారు. మాకు కొలువులు ఇస్తావా లేక గద్దె దిగుతావా, నిరుద్యోగుల పాలిట ఉరితాడులా జగనన్న మారిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్ లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న భావి భారత పౌరులు నిరుద్యోగులకు, ఆనాడు 2019 ఎన్నికలలో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు వదులుతానని హామీలు ఇచ్చి అలాగే ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగ నోటిఫికేషన్లు అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ అలాగే నిరుద్యోగులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి వారి ఆత్మహత్యలకు కారణం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఖాళీగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, పోలీసు ఉద్యోగాలు, అలాగే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఖాళీలను వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసి వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement