Saturday, May 18, 2024

ఢిల్లీలో రెండోరోజు వైభవంగా ఉగాది వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో రెండోరోజూ ఉగాది సంబరాలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్‌ల ఆధ్వర్యంలో శుభకృత్ నామ ఉగాది ఉత్సవాలు రెండో రోజూ ఘనంగా నిర్వహించారు. ఆదివారం కళాకారుల నాదస్వరంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆనంతరం పుష్పాంజలి శాస్త్రీయ నృత్యం, అరకు గిరిజన కళాకారుల థింసా నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆప్కో సౌజన్యంతో నిర్వహించిన చేనేత వస్త్ర ఫ్యాషన్ షోలో 21 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మవరం, వెంకటగిరి, పొందూరు, చీరాల, మంగళగిరి తదితర ప్రాంతాల వస్త్రాలను ధరించి పాల్గొన్నారు. చిత్రలేఖనంలో నైపుణ్యం ప్రదర్శించి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. వినాయక నాట్య మండలి కళాకారులు ‘శ్రీనివాస కళ్యాణం’ నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. సంబరాలకు హాజరైన వారికి రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, కాణిపాకం దేవస్థానాల ప్రసాదాలు, ఉగాది పచ్చడి, ఉచిత ఆంధ్ర సంప్రదాయ విందు భోజన వితరణను ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఏర్పాటు చేశారు. కరోనా భయంతో రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమైన జనం ఈ ఉగాది వేడుకలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement