Sunday, April 28, 2024

TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు విడుదల 

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు(ఆదివారం) టీటీడీ  విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన టీటీడీ ఇప్పుడు ఆర్జిత సేవలకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుక్‌ చేసుకునే వీలుంటుంది. భక్తులు ఆయా సేవలు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement