Monday, April 29, 2024

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ కీలక నిర్ణయాలు ఇవే..

తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్‌ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అథారిటీ చైర్మన్‌ జవహర్‌రెడ్డి అధ్యక్షతన తొలిసారి ఈ సమావేశం జరిగింది. తిరుమల అభివృద్ధి పనుల నిధుల కేటాయింపుపై సమావేశంలో చర్చించారు. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. బర్డ్‌ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.2.3 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో సీతారామస్వామి ఆలయ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. త్రిదండి చినజీయర్‌ స్వామి సూచనల మేరకు 10 ఆలయాల పునర్నిర్మాణం కోసం రూ.9 కోట్లు వినియోగించాలని నిర్ణయించారు.  స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తుల భాగస్వామ్యం, నవనీత సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి 12 లక్షల డైరీలు, 8 లక్షల క్యాలండర్లు, 2 లక్షల చిన్న డైరీలు ముద్రించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement