Thursday, May 2, 2024

దివ్యాంగులకు టీటీడీ చేయూత.. ప‌లు కోర్సుల్లో ఉచిత శిక్ష‌ణ‌, ఉపాధి అవ‌కాశాలు: అశోక్‌కుమార్‌

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : సమాజంలో నిరాదరణకు గురైన దివ్యాంగుల‌కు చేయూత‌నిస్తున్నామ‌ని టీటీడీ పాలకమండలి సభ్యుడు అశోక్ కుమార్ అన్నారు. ఇవ్వాల‌ (బుధవారం) వెంకటేశ్వర వికలాంగుల ఐటీఐ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1984లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వికలాంగుల శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటు చేశార‌న్నారు. అలాగే తిరుపతి, భీమవరం, విజయనగరం, బాపట్ల, వరంగల్ ప్రాంతాల్లో 1974లో బదిరుల పాఠశాలను కూడా ప్రారంభించిన‌ట్టు గుర్తు చేశారు. ఆ పాఠశాలలో పదో తరగతి పూర్తయిన దివ్యాంగుల‌కు శ్రీ వెంకటేశ్వర వికలాంగుల శిక్షణ కేంద్రంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఐటిఐ కోర్స్ లు. వెల్డర్, టైలర్స్, ఫిట్టర్, క్యాథలిక్, మెకానిక్, టైప్ రైటింగ్ వంటి కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.

ప్రతి సంవత్సరం దాదాపు 60 మంది విద్యార్థులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న‌ట్టు చెప్పారు. మరో నాలుగు రకాల కోర్సులను కూడా అందించేందుకు బోర్డు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు టీటీడీలో లభిస్తాయ‌న్నారు. ప్రత్యేకంగా శ్రీ సిటీ మొబైల్ కంపెనీ, కియో మోటార్స్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్న‌ట్టు తెలిపారు. అనంతరం టీటీడీ ఉద్యోగుల కోసం సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ద్విచక్ర వాహన పార్కింగ్ సముదాయాన్ని పరిశీలించి జులై వ‌ర‌కు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు ఒకటో తేదీ కల్లా టిటిడి ఉద్యోగులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో టిటిడి కళాశాల ప్రిన్సిపాల్ రమణమూర్తి, వైఎస్ఆర్సిపీ నాయకులు బండ్ల లక్ష్మీపతి. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement