Friday, May 3, 2024

Breaking: వీర్రాజు వీరంగం.. డ్యూటీలో ఉన్న పోలీసులపై జులం

తూర్పు గోదావరం జొన్నాడ వద్ద బీజేపీ ఏపీ చీఫ్​ వీర్రాజు కాసేపు వీరంగం సృష్టించారు. కోనసీమకు వెళ్తున్న క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై చిందులు తొక్కారు సోము వీర్రాజు. ఒక దశలో ఎస్​ఐని గట్టిగా తోయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా రికార్డ్​ అవుతున్నా కూడా ఏ కోశానా వీర్రాజు వెనక్కి తగ్గలేదు. తననే ఆపుతారా.. మీ లెవల్​ ఎంత అనే రీతిలో పోలీసులపై జులుం ప్రదర్శించారు వీర్రాజు. కోనసీమలో 144 సెక్షన్​ ఉందని, వెళ్లడానికి వీళ్లేదని సముదాయించిన పోలీసు అధికారుల మీది మీదికి వెళ్తూ బూతులు తిట్టారు. మీకెంత దమ్ముంది.. నన్నే ఆపుతారా అంటూ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై ఘర్షణకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement