Sunday, November 28, 2021

TS: నెత్తుటి బాకీ తీర్చుకుంటామ‌న్న మావోయిస్టులు.. టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు.. రేపు బందుకు పిలుపు

వాజేడు (ప్రభ న్యూస్): నిన్న జరిగిన ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ రేపు బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేర‌కు లేఖ‌ విడుదల చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మానవ రక్తానికి మరిగి విప్లవకారులను హత్యలు చేసి ప్లీనరీ పేరిట నెత్తుటి హోలీ ఆడుతోంద‌ని లేఖలో పేర్కొన్నారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. నెత్తుటి బాకీ తీర్చుకోవడానికి ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏ క్షణం ఎలాంటి చర్యల‌కు పాల్పడతారోన‌ని భయాందోళనకు గురవుతున్నారు. ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈనెల 27న బందుకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దు ప్రాంతం పోలీసులను అప్రమత్తం చేసి ఏజెన్సీ మండలాలలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా వాజేడు మండలం పేరూరు ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలంగాణ సరిహద్దు చిట్టచివరి గ్రామమైన టేకుల గూడెం గ్రామం నుండి చెరుకూరు వరకు 163 జాతీయ రహదారి పై ఉన్న కల్వర్టు లను తనిఖీ చేశారు. వాజేడు మండలంలోని పోలీసులు మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి పోలీసు బలగాలను మోహరింప చేసి ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ టార్గెట్ నేతలకు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చూసినట్లు సమాచారం.

ప్రతీకార చర్య తో రగిలిపోతున్న మావోయిస్టులు ఏ క్షణమైనా దృశ్య చర్యలకు పాల్పడవచ్చని గ్రహించిన పోలీస్ వర్గాలు సరిహద్దు గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాయి దీనితో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News