Sunday, April 28, 2024

పర్యాటక ప్రాంతాలన్నింటికీ రవాణా అనుసంధానం.. బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటాన‌న్న మంత్రి రోజా

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్రచారకర్త (స్పెషల్‌ అంబాసిడర్‌)గా పని చేస్తానని పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీలోని పర్యాటక ప్రాంతాలను దేశవిదేశీయలుకు పరిచయం చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఇందులో భాగంగా తరుచూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆమె సూచించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు.

ఆ తరువాత ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికి ఇప్పటికే చేపట్టిన ప్రాజక్టుల పనులను వేగవంతం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజక్టులను చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిలను రూపొందించాలని సూచించారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చి వాటి అమలుకు కృషిచేస్తానన్నారు. సమావేశంలో పాల్గొన్న సాహిత్య అకాడమీ, మ్యూజిక్‌, డ్యాన్సు అకాడమీ, నాటక అకాడమీ, విజ్యువల్‌ ఆర్ట్సు అకాడమీ, జానపద కళల అకాడమీ, హిస్టరీ, సైన్సు అండ్‌ -టె-క్నాలజీ అకాడమీల చైర్‌ పర్సన్లు చేసిన పలు వినతులపై ఆమె స్పందిస్తూ అకాడమీల చైర్‌ పర్సన్లకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమ కూర్చుతామన్నారు. విజయవాడలో ఏర్పాటు- చేస్తున్న బిర్లా ఫ్లానిటోరియం కార్యకలాపాల్లో సైన్సు, -టె-క్నాలజీ అకాడమీ చైర్‌పర్సన్‌ను కూడా భాగస్వామ్యులను చేయాలని అధికారులకు ఆమె సూచించారు. కళాకారులు అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసే విధంగా మార్గదర్శకాలను రూపొందించి జిల్లా కలెక్టర్లకు తెలియపరచాలని సాంస్కృతిక శాఖ అధికారులకు మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement