Friday, May 3, 2024

నేడు కర్నూలులో నారా లోకేష్ ఓదార్పు యాత్ర

మహిళలపై అఘాయిత్యానికి వ్యతిరేకంగా టీడీపీ నేత నారా లోకేష్ గళం విప్పుతున్నారు. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఏడాది క్రితం హత్యకు గురైన హాజీర కుటుంబాన్ని అఖిలపక్ష నాయకులతో కలిసి పరామర్శించనున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత గఫూర్‌ లు పరామర్శ చేయనున్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి తర్వాత ఎర్రబాడు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కాగా నిన్న గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినపు ఉద్రిక్త వాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ కర్నూలు పర్యటన ఉత్కంఠను రేపుతోంది. నిన్న సీఎం జగన్ పై లోకేష్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకొచ్చిన దిశా చట్టం కింద ఒక్కరికైనా శిక్షపడిందా.. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే గుంటూరు రమ్య కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వానికి 20 రోజుల సమయం ఇస్తున్నామని.. రాసి పెట్టుకోండి.. 21వ రోజు మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అన్నారు. దొంగచాటుగా చేయాలనుకుంటే పొరపాటే.. 500మంది మహిళలపై దాడులు జరిగాయి.. న్యాయం జరగలేదని.. ప్రభుత్వం ఎందుకు దోషులను శిక్షించలేకపోతోందని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను కలుస్తా.. వాళ్లకు అండగా నిలబడతాను అన్నారు.

ఇది కూడా చదవండి:ఉపాధి బిల్లుల విషయంలో కేంద్రానికి లేఖ రాసిన రఘురామ

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement