Thursday, May 19, 2022

గంగమ్మకు సారే సమర్పించిన మేయర్

తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శుక్రవారం ఉదయం మేయర్ శీరిష కుటుంబ సభ్యులతో సారె సమర్పించారు. స్థానిక పెద్దకాపు లేఅవుట్ లోని తన నివాసం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు, నగరపాలక ఉపమేయర్లు, కార్పొరేటర్లు, బంధువులు, అభిమానులతో కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. కోలాటాలు, డప్పులు, సప్పరాలు సన్నాయి వాయిద్యాల మధ్య, భక్తులు విచిత్ర వేషధారణలతో, కుటుంబ సభ్యులు ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలో అమ్మవారికి శేష వస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన గంగమ్మకు పట్టువస్త్రాలతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. గంగమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ కట్ట గోపి యాదవ్, ఈవో ముని కృష్ణయ్య, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement