Thursday, April 25, 2024

Tirupathi – తాళపత్ర పరిరక్షణ దేశ వ్యాప్తంగా జరగాలి…సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) – వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్తం చేసిన తాళపత్రాలను పరిరక్షించే కృషి దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంద‌ని
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద, వేదాంగా, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ , దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియ, వాటి ప్రచురణలను ఆయ‌న ఈరోజు ప‌రిశీలించారు.

అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను గొప్పగా పరిరక్షిస్తున్నారని వేద విశ్వ‌విద్యాల‌య నిర్వాహ‌కుల‌ను ప్ర‌శంసించారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపటం, అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం త‌న‌కు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement