Monday, April 29, 2024

Tirumala: పెరిగిన ర‌ద్దీ… టోకెన్ల కోసం భారీ క్యూలైన్లు…

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. సర్వదర్శనం టోకెన్ల కోసం కేంద్రాల్లో భక్తులు భారీ క్యూలైన్లు కట్టారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తిరుమల రద్దీగా మారింది.

రేపటి నుంచి జనవరి 1వరకు దాదాపు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం జరుగనుంది. ఇందుకోసం రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విక్రయించింది. ఇప్పటివరకు 2 లక్షల 25 వేల టికెట్లను విక్రయించింది. శనివారం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. 9 కేంద్రాల ద్వారా టీటీడీ టోకెన్లు జారీ చేస్తున్నారు. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement