Monday, April 29, 2024

టిడ్కో ఇండ్ల‌కు వేళాయే.. సీమలో 75వేల ఇళ్ల‌కు రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ షురూ

రాయలసీమ ప్రభన్యూస్‌ ప్రతినిధి : సొంతింటి కల నిజం చేసుకోవాలని కళ్లు కాయలు కాసేలా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు టిడ్కో గృహ యోగముకు వేళ అయింది. రాయలసీమంలోని తిరుపతి, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని నగరపాలక, పురకపాలకల్లో టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్‌లు మొదలయ్యాయి. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో గత తేదేపా ప్రభుత్వం టిడ్కో నేతృత్వంలో జీప్లస్‌ త్రీ తరహాలో మూడు రకాలు ఇళ్లు నిర్మించారు. 365,300,430 చదరపు అడుగుల్లో పూర్తిగా విదేశీ షేర్‌వార్న్‌ -టె-క్కాలనీని ఉపయోగించి ఇళ్లను నిర్మించారు. 300 చదరపు అడుగుల ఇంటికి రూ.500లు లబ్దిదారులు వాటా కాగా ఇది పూర్తిగా ఉచింతం. 365చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.50000,430 చదరపు అడుగుల నివాసానికి లబ్దిదారుని వాటా రూ.లక్ష ఉండగా, మిలిలినది బ్యాంకు లోన్‌ మంజూరు చేస్తోంది.

సీమలో మొత్తం గృహాలు 65వేలు..

తిరుపతి జిల్లా పరిధిలో ఏడు ప్రాంతాల్లో 15088 గృహాలు పూర్తి అయ్యాయి. అధికంగా గూడూరులోని గాంధీనగర్‌లో 5120, నాయుడుపేట, శ్రీకాళహస్రి, సూలూరు పేట, పుత్తూరు, వెంకటగిరి ప్రాంతాల్లొ గృహాలు నర్మించారు. శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపూర్‌, కదిరి, ధర్మరవరం, పుట్టపర్తి జిల్లాల్లో 4176ఇళ్లు నిర్మించారు. అధికంగా ధర్మవరం మున్సిపాలిటీ- పరిధిలో 1440గృహాలు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా పరిధిలో 12096ఇళ్లు పూర్తి చేయగా ,పామిడి, అనంతపురం, తాడిపర్తి, గుంతకల్‌, రాయదుర్గం , గుత్తి పరిధిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, తాడిపత్రిలో 2880ఇళ్లు నిర్మించారు. అన్నమయ్య జిల్లా పరిధిలో 2112 గృహ నిర్మాణాలు చేపట్టగా మదనపల్లి, రాయచోటి ప్రాంతాలలో ఉన్నాయి. .చిత్తూరు జిల్లాలోని మొత్తం 4368 టిడ్కో గృహ నిర్మాణాలు చేపట్టగా చిత్తూరు పుంగనూరు పరిధిలో పూర్తి చేశారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పరిధిలో జమ్ములమడుగు, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల ప్రాంతాలలలో5600ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. కర్నూలు జిల్లా పరిధిలో ఆదోని,ఎమ్మిగనూరు పురపాలికలతో పాటు- కర్నూలు నగరపాలక సంస్థతో కలిపి 18992ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. అధికంగా నగర శివారులోని తాండ్రపాడు, తడకనపల్లి, ఒక్కోచోట 10వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. నంద్యాల జిల్లా పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌ పురపాలకల పరిధిలో 11680ఇళ్లు పూర్తి చేశారు. నంద్యాల పట్టణంలో మూలసాగరం, అయ్యలూరు మెట్ట ప్రాంతాల్లో 9వేల గృహాలు నిర్మించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement