Friday, May 17, 2024

గురుకులాల్లో ప్రవేశాలకు మూడో జాబితా విడుదల..

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ గురుకుల విద్యాలయముల సంస్థ నిర్వహిస్తున్న ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ కళాశాల 2022 -23 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీఆర్‌జేసీ – ఏపీఆర్‌ డీసీ సెట్‌ -2022లో అర్హులైన అభ్యర్థుల మూడో విడత జాబితాను విడుదల చేసినట్లు కన్వీనర్‌ జె.సోమదత్త తెలిపారు. Https://aprs dot apcfss.in వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు పై వెబ్‌సైట్‌ నుందు తమ హాల్‌ టిక్కెట్‌, పుట్టిన తేదీ ఆధారంగా ఎంపికను పరిశీలించుకోవచ్చని సూచించారు.

కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి మూడవ విడతలో ఎంపికైన విద్యార్థులు, వారి ప్రొవిజినల్‌ సెలక్షన్‌ ఉత్తర్వుల ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఈనెల 7వ తేదీ లోపు సంబంధిత ఒరిజినల్‌ ధృవ పత్రాలు, ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో ఆయా కళాశాలల ప్రధానాచార్యులకు రిపోర్ట్‌ చేయాలన్నారు. ఏడో తేదీ తరువాత సంబంధిత క్యాటగిరీలల్లో మిగిలిన ఖాళీల ఆధారంగా తదుపరి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement