Thursday, May 2, 2024

వైసీపీ గర్జనకు పోలీస్ యాక్ట్ 30 వర్తించదా ?.. పవన్ కళ్యాణ్

వైసీపీ గర్జనకు పోలీస్ యాక్ట్ 30 వర్తించదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ పర్యటనపై మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికార పార్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎదురెళ్లాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. జనసేన ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ గురించి వైసీపీకి ఎందుకు చెప్పాలని అన్నారు. అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదన్నదే వైసీపీ లక్ష్యమన్నారు. మూడు రాజధానుల గురించి ఎవరూ విమర్శించకూడదన్నదే వైసీపీ టార్గెట్ అన్నారు. తమిళనాడు, తెలంగాణల నుంచి తరిమేసినా మనకు సిగ్గురాకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. వైసీపీకి పోటీగా ప్రోగ్రాం పెట్టే ఉద్దేశం తమకు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement