Sunday, April 28, 2024

Big Story: సంక్రాంతి వస్తోంది.. పల్లె పిలుస్తోంది.. పట్టణం కదులుతోంది

సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న కొద్దీ సిటీ జనం పల్లె బాట పడుతుంటారు. ఈ సారి కొంచెం ముందుగానే సొంతూళ్లకు వెళ్తుండడంతో హైవేలపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద వెహికల్స్ క్యూ కట్టి కనిపిస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో చాలామంది ఎక్కువగా సొంత వాహనాల్లోనే జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. శని, ఆదివారాలు కావడం కూడా ప్రయాణాలకు కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, -విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో పండుగ కోసం ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు రద్దీగా ఉండడంతో చిట్యాల సమీపంలో హైవేపై వాహనాలు బారులు తీరాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లలో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉప్పల్, ఎల్‌బీ నగర్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి రీజియన్‌లలో ప్రైవేట్ బస్సులు కూడా నిలిచిపోయాయి.

పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కూడా రాష్ట్రంలోని జిల్లాల వైపు 3,338 బస్సులు, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు 984 బస్సులతో సహా 4,322 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికుల నుంచి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయకుండానే జనవరి 7 నుంచి జనవరి 15 దాకా ఈ స్పెషల్ బస్సులు తిరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు, పోలవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, చిత్తూరు, కడప, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు లాంటి పెద్ద పట్టణాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement