Sunday, April 28, 2024

చంద్రబాబును సీఎం చేయడమే కమ్యూనిస్టుల లక్ష్యం.. పేర్ని నాని

కమ్యూనిస్టుల్లో కమ్యూనిజం ఉందా ? చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యమని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకుండా పారిపోయారని అన్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరని అన్నారు. నిజమైన కమ్యూనిస్టులు పేదలు బాగుండాలని పోరాడుతారన్నారు. పేదోడికి ఇంటి పట్టా ఇవ్వొద్దని వాదించే వాడికి మద్దతిచ్చే వారు కమ్యూనిస్టులా అని పేర్ని నాని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement