Thursday, May 2, 2024

Breaking: బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసు : ఏ5గా టీజీ వెంకటేష్

బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసు రిమాండ్ రిపోర్టులో ఎంపీ టీజీ వెంకటేష్ ను ఏ5గా పోలీసులు చేర్చారు. మొత్తం 80మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఏపీ జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ స్థలంలో 80మంది నిందితులు అక్రమంగా ప్రవేశించారని, జేసీబీలు, హాకీ స్టిక్స్ తో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్టును తయారు చేశారు. ఏపీ జేమ్స్ సంస్థ ప్రాపర్టీని ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేసి అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పీపుల్ టెక్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారే దాడి చేశారని ఏపీ జెమ్స్ సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేసినట్లు రిపోర్టు తయారు చేశారు. 2021లోనూ ఇదే తరహాలో దాడులకు యత్నించారని, టీజీ వెంకటేష్, విశ్వ ప్రసాద్, సుభాష్ పులిశెట్టి, విధున్, వీవీఎస్ శర్మ సహా 80మందిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసు రిమాండ్ రిపోర్టును తయారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement