Monday, May 27, 2024

Telugudesam – ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4వ తేది నుంచి బస్సు యాత్ర

కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ వినృతస్థాయి సమావేశం సోమవారం ఉదయం 10 గంటల నుండి కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్హాల్ నందు (నంద్యాల రోడ్) నిర్వహించనున్నట్లు నూతనంగా నియమించబడిన కర్నూలు. పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు బి.టి.నాయుడు తెలియజేశారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కోడుమూర్ పార్టీ ఇన్చార్జీ ఆకెపోగు ప్రభాకర్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కె.యి. జగదీష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు…

ఈ సందర్భంగా బి.టి.నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ , పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, కర్నూలు జిల్లా పార్టీ పెద్దలందరి ఏకాభిప్రాయంతో తనను కర్నూలు పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందన్నారు.

కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించబడుతుందన్నారు.ఈ సమావేశమునకు కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ పాలిటీబ్యూరో సభ్యులు, జాతీయ ఉపాధ్యక్షులు, నియోజకవర్గం పార్టీ ఇన్చార్జీలు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభకు పోటీచేసిన నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కమిటీలో ఉన్న ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు, అలాగే రాష్ట్ర అనుభంద కమిటీలలోను, సాధికార కమిటీలలో ఉ న్న నాయకులు, జిల్లా పార్టీ కమిటీ, మరియు పార్టీ అనుబంద్ద కమిటీల నాయకులు, నియోజకవర్గంస్థాయి కమిటీలలో ఉన్న నాయకులు, మండల, పట్టణ, నగర కమిటీలు, అనుబంద కమిటీ నాయకులు గ్రామస్థాయి కమిటీల నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలు, గ్రామస్థాయి సర్పంచులు, యం.పి.టి.సి. సభ్యులు, మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, మాజీ యం.పి.పి.లు, మాజీ జడ్.పి.టి.సి. సభ్యులు, మాజీ యం.పి.టి.సి. సభ్యులు, వివిధ స్థాయిల మాజీ ఛైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోబిలాషులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నంది మధు, సంజీవలక్ష్మీ, కె. పరమేష్, పి. రవికుమార్, సత్రం రామక్రిష్ణుడు, డి. జేమ్స్, యస్.ఆబ్బాస్, షేక్షావలి, గోవిందునాయుడు, రామక్రిష్ణ, పి.హనుమంతరావు చౌదరి మొదలగు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement