Sunday, May 19, 2024

రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ ప్రభుత్వమే… డి కె అరుణ

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జులై 2 (ప్రభ న్యూస్) – అవినీతిమయమైన కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర నుండి తరిమేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న మోడీ పరిపాలన తీసుకురావాలని అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ. జోగులాంబ గద్వాల జిల్లా: ఆదివారం రోజు గద్వాల మండలంలోని బిజెపి జెండా ఆవిష్కరణ సందర్భంగా జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ..
జోగులంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం, పరుమాల, కుర్వపల్లి, కాకులరం, సంఘాల, గోన్ పాడు గ్రామాలలో బిజెపి జెండాలను ఆవిష్కరించారు .. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి డికె. అరుణ మాట్లాడుతూ..కేసీఆర్‌ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిజెపి పార్టీ ప్రభుత్వమేనని అన్నారు.
దేశంలో, రాష్ట్రంలో ప్రజలు బిజెపి పార్టీ రావాలని కోరుకుంటున్నారన్నారు.


.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడని రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు నిచ్చారు. కెసిఆర్ కు రైతుల పై చిత్తశుద్ధి లేదని ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందని కెసిఆర్ ఎందుకు అమలు చేయడం లేదు అని అన్నారు. ఉచిత ఎరువులని చెప్పి మోసం చేసాడన్నారు. ఎకరాకు 20వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఇస్తుందన్నారు.
రైతులకు సబ్సిడీ లు బందు చేసి రైతు బంధు ఇస్తున్నాడన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు యూరియా మీద 3000 ఉంటే కేవలం 300కు, డిఏపి కూడా దాదాపు 2,500 ఉంటే డిఏపి సగం సబ్సిడీ ఇచ్చి అన్ని ఎరువులపై కేంద్రం సబ్సిడీ భరిస్తుందన్నారు. ఎంతో మంది అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని మొత్తం దోచుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశం మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు ఖర్చు పెట్టే అంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు

- Advertisement -

. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, గద్వాల మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్రరెడ్డి, పుడూర్ నరేందర్ రెడ్డి, బిరెల్లి రాధాకృష్ణ రెడ్డి, అనంతపురం విష్ణువర్ధన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కుర్వపల్లి తిరుపతి, క్రిష్ణ మూర్తి, సంఘాల జయ రాములు, శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement