Friday, May 3, 2024

దళిత బంధు పథకం.. హుజురాబాద్ కు మరో రూ.500 కోట్లు

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళిత బంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.

హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకుగాను మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2 వేల కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండిః ఈటలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement