Monday, April 29, 2024

‘కరోనా బాధితులకు భరోసా’.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

రాష్ట్రంలోని కొవిడ్ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పరిశీలించేందుకు టీడీపీ పిలుపునిచ్చిన ‘కొవిడ్ బాధితులకు భరోసా’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రుల సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలను సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రం ఆసుపత్రులను రామానాయుడు నేతృత్వంలో సందర్శించేందుకు వెళ్తుండగా.. ఎమ్మెల్యే బయటకు రాకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో బీటెక్ రవిని హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా బాధితులకు అండగా నిలచేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను సందర్శించాలని టీడీపీ నిర్ణయించింది. ‘బాధితులకు భరోసా’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో టీడీపీ నాయకులును పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

గుంటూరులో జీజీహెచ్ వద్ద మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ఆయనతో పాటు టీడీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలు జీజీహెచ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో మహారాజ కోవిడ్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేశారు

- Advertisement -

ఇది కూడా చదవండి: సరిహద్దులలో పాస్ ల లొల్లి !!

Advertisement

తాజా వార్తలు

Advertisement