Friday, March 29, 2024

యాస్ అలజడి మొదలు!!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ అలజడి మొదలైంది. నేడు తుఫాన్ గా, రేపు అతి తీవ్ర తూఫాన్ గా ఇది మారనుంది. ప్రస్తుతం పారదీప్‌కు ఆగ్నేయంగా 570 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. ఎల్లుండి సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.యాస్ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపటి నుంచి 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే వరకు గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఈ వేగం 155-165 నుంచి 185 కి.మీ వరకు వేగంతో గాలులు వీస్తాయి‌. కాగా ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు అప్రమత్తమైన రైల్వే, 59 రైళ్లు ఈ నెల 30 వరకు నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement