Wednesday, May 1, 2024

తెలంగాణ తీరుతో ఆంధ్రకు అన్యాయం: ఏపీ టీడీపీ నేత

నీటి అంశంలో తెలంగాణ తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ ఆయకట్టును ఆంధ్రప్రదేశ్‌లో 1.30 లక్షల ఎకరాల నుంచి 3.67 లక్షల ఎకరాలకు పెంచారని.. తెలంగాణ ఇంజనీర్‌-ఇన్‌-ఛీఫ్‌ సి.మురళీధర్‌ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేశారు. దీంతో తెలంగాణ తీరుతో ఆంధ్ర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని ముద్దరబోయిన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ క్రింద జోన్‌-1 తెలంగాణలోని నల్గొండ, జోన్‌-2 ఖమ్మం జిల్లాల క్రింద 6.62 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో జోన్‌-2 క్రింద 1.57 లక్షల ఎకరాలు, జోన్‌-3 క్రింద 2.10 లక్షల ఎకరాలు కలిపి 3.67 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం 10.29 లక్షల ఎకరాలు చట్టబద్దంగా  ఏర్పడిందన్నారు. ఆయుకట్టు అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులనుంచి రెండు రాష్ట్రాలలో కాలువలు అభివృద్ధి చేసిన విషయం తెలంగాణ ఇ.ఎన్‌.సి.కి గుర్తులేదా అని ముద్రబోయిన ప్రశ్నించారు.

వాస్తవం ఇలా వుంటే ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు 1952 లో హైదరాబాద్‌ రాష్ట్రం తయరుచేసిన నందికొండ ప్రాజెక్టు నివేదిక అని, 1956లో రాష్ట్ర పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టును పెంచిందనే  తెలంగాణ ఇ.ఎన్‌.సి., వాదనను తీవ్రంగా ఖండించారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ ఆంధ్రప్రదేశ్‌లోని చట్టబద్ధ ఆయకట్టు 3.67 లక్షల ఎకరాలు ఆయకట్టులో ఒక్క ఎకరం తగ్గించినా సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ధీటుగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .ఈ విషయంలో వైసిపి ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే మొసలి కన్నీరు కార్చడం మాని ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలని ముద్రబోయిన డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎగువ భాగాన ఎపెక్స్‌ కౌన్సిల్‌, సి.డబ్ల్యు.సి., కె.ఆర్‌.ఎం.బి. నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా పాలమూరు 90 టి.ఎం.సి.లు, దిండి 30 టి.ఎం.సి.లు, మిషన్‌ భగీరధ 19.59 టి.ఎం.సి.లు, భక్త రామదాస 5.50 టి.ఎం.సి.లు, తుమ్మెళ్ళ 5.44 టి.ఎం.సి.లు మొత్తం 150 టి.ఎం.సి.లతో కొత్త ప్రాజెక్టులు, ఎస్‌.ఎల్‌.బి.సి. 40 టి.ఎం.సి.లు, కల్వకుర్తి 40 టి.ఎం.సి.లు, నెట్టెంపాడు 25 టి.ఎం.సి.లు మొత్తం 105 టి.ఎం.సి.లతో విస్తరణ కలిపి మొత్తం 255 టి.ఎం.సి.లతో ప్రాజెక్టులు చేపడితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం దిగువ భాగాన నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల క్రింద 15 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా క్రింద 13 లక్షలు, ఎస్‌.ఆర్‌.బి.సి. క్రింద 2 లక్షలు మొత్తం 30 లక్షల ఎకరాలు బీడుబారే ప్రమాదం వుందని, దీనిమీద 2016 లో రైతులు సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళారని, అలాగే చట్టబద్ధ సంస్థలైన కేంద్ర జలశక్తి శాఖ, సి.డబ్ల్యుసి., కె.ఆర్‌.ఎం.బి.కి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారన్నారు దీనిమీద తెలంగాణ ఇ.ఎన్‌.సి., మురళీధర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ఇదే విషయాలమీద రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిలో దిగువ భాగాన వున్న ఆంధ్రప్రదేశ్‌ రైతుల  చట్టబద్ధమైన నీటి హక్కులు కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement