Saturday, May 4, 2024

Breaking: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో అయ్యన్నను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరంలో జరిగిన యువగళం సభలో సీఎం ను, మంత్రులను అయ్యన్న దూషించినట్లు ఆరోపణలున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పీఎస్ లో పేర్నినాని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement