Saturday, April 27, 2024

కల్తీ సారాపై టీడీపీ ఆందోళన.. రెండు రోజులు నిరసనలకు పిలుపు

పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ ఆందోళనకు సిద్ధమైంది. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత నాలుగైదు రోజులుగా పట్టుబడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు. జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జే-బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని టీడీపీ డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతోందని టీడీపీ విమర్శిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement