Saturday, May 4, 2024

ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపిన‌ రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలందరూ హోలీ సంబురాల్లో మునిగిపోయారు. హోలీ సంద‌ర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ.. సమాజంలో సామరస్యానికి ప్రతీక. ఇది వసంత రుతువు రాకను చెప్పే పండుగ. ఈ పండుగ దేశప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను’’ అని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ‘దేశ ప్రజలందరికీ హోలీ పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పరస్పర ప్రేమ, ఆప్యాయత, సోదర భావానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement