Tuesday, May 7, 2024

చంద్రబాబుకు రిమాండ్‌.. రేపు ఏపీ బంద్‌కు టిడిపి పిలుపు

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా.. సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మరోవైపు చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రేపు విచారించే అవకాశం ఉంది. ఓ వైపు చంద్రబాబును రాజమహేంద్రరం సెంట్రల్‌ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా ఆయనకు హౌస్‌ అరెస్టులో ఉండే అవకాశం కల్పించాలని అతని తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి విన్నవించారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement